Tuesday, November 26, 2024

78 ఆలౌట్: ఇంగ్లండ్ పేస్ దాటికి కుప్పకూలిన టీమిండియా..

టీమిండియా మరోసారి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 78 పరుగులకే కుప్పకూలింది. హెడింగ్లేలో ఇంగ్లండ్ పేసర్లు చెలరేగడంతో కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌటైంది. ఏమాత్రం ప్రతిఘటన చేపకుండా పెవిలియన్‌ను క్యూకట్టారు భారత బ్యాట్స్‌మెన్లు. రోహిత్ శర్మ 19, రహానే 18 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ లో ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ ను అవుట్ చేయడం ద్వారా ఆండర్సన్ టీమిండియా పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆపై పుజారా, కోహ్లీలను కూడా పెవిలియన్ చేర్చిన ఈ సీనియర్ బౌలర్ భారత టాపార్డర్ ను కకావికలం చేశాడు. ఆండర్సన్ కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఓల్లీ రాబిన్సన్ (2), శామ్ కరన్ (2), క్రెగ్ ఒవెర్టన్ (3) కూడా స్వింగ్ బౌలింగ్ తో భారత బ్యాటింగ్ లైనప్ ను హడలెత్తించారు. దాంతో భారత్ కు కనీసం 100 పరుగుల మార్కు చేరే అవకాశం కూడా దక్కలేదు. పేస్‌ పిచ్‌పై ఏమాత్రం బౌలర్లను ఎదుర్కోలేకపోయారు.. భారత ఇన్సింగ్స్‌లో రోహిత్‌ శర్మ 19, రహానె 18 పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గర స్కోర్‌ చేయలేదు.. విరాట్‌ కోహ్లీ 7 పరుగులు చేస్తే.. రవీంద్ర జడేజా 4, సిరాజ్‌ 3, రిషభ్‌ పంత్‌ 2, బుమ్రా, మహ్మద్ షమీ డకౌట్‌ అయ్యారు. ఇక, ఇండ్లండ్‌ బౌలర్లు నిప్పులు చెరిగాడు.. అండర్సన్, ఓవర్టన్‌ చేరో మూడు వికెట్లు తీయగా.. కరన్‌, బిన్సన్‌ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఇది ఏడవసారి: కోహ్లీ వికెట్ మళ్లీ అండర్సన్ కే..

Advertisement

తాజా వార్తలు

Advertisement