న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ కష్టాలో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఆదిలోనే చుక్కెదురయింది. మొదటి వన్డేల్లో జట్టుకు శుభారంభాన్ని అందించిన ఓపెనింగ్ జోడీని 8వ ఓవర్‌లోనే కివీస్ బౌలర్లు విడగొట్టారు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌ను.. ఇన్నింగ్స్ 8 ఓవర్ 4వ బంతికి ఆడమ్ ఔట్‌చేశాడు. దీంతో 39 పరుగుల వద్ద టీమ్‌ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది. అయితే నాలుగు ఓవర్ల వ్యవధిలోనే భారత్ మరో వికెట్‌ను చేజార్చుకుంది. 28 పరుగులు చేసిన టీమ్‌ఇండియా కెప్టెన్ ధావన్.. ఆడమ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 49, రిషబ్ పంత్ 10 పరుగులు చేశారు. ఇలా వరుసగా వికెట్లు కోల్పోయింది ఇండియా. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. 51 పరుగులు చేయడంతో స్కోర్ 219 పరుగుల వరకు చేరింది. మొత్తంగా 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ జట్టు విజయం సాధించాలంటే.. 220 పరుగులు చేయాల్సి ఉంది.