అతి తక్కువ కాలంలో.. అసాధారణ ప్రతిభతో.. జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఇండియా ఎ హెడ్ ఆంగ్ల న్యూస్ చానెల్ మరో ఘనత సాధించింది. దక్షిణాది నుంచి సంచలన కథనాలు వెలుగులోకి తీసుకొస్తూ.. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. దక్షిణాది సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి.. వాటి పరిష్కారానికి నిర్విరామంగా కృషి చేసిన జాతీయ వార్తా చానెల్.. బెస్ట్ డిబెట్ ఆంగ్ల న్యూస్ చానెల్-ఇంగ్లిష్ (గోల్డ్), టాక్ టు భూపేన్ షో కోసం బెస్ట్ షో విత్ డిజిటల్ ఇంటిగ్రేషన్ ప్రైమ్ టైం (గోల్డ్) (యాంకరింగ్ అండ్ ఇంటిగ్రేషన్), బెస్ట్ డిజిటల్ టెక్ షో (సిల్వర్) అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. దేశ రాజధాని హస్తినలోని ఇంపీరియల్ హోటల్లో న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ జాతీయ వేదికగా అవార్డులను ఇండియా ఎహెడ్ చానెల్ సొంతం చేసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అసాధారణ ప్రతిభతో..
ఏ చానెల్‌కు దక్కని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది ఇండియా ఎహెడ్ చానల్. అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న ఇండియా ఎహెడ్ ఆంగ్ల న్యూస్ చానెల్ ఖాతాలో మరిన్ని అవార్డులు వచ్చి పడ్డాయి. బెస్ట్ ఇంగ్లిష్ యాంకర్ కేటగిరీలో కూడా తన సత్తా చాటింది. ఇండియా ఎహెడ్ ఆంగ్ల న్యూస్ చానెల్ యాంకర్, భూపేంద్ర చౌబే.. ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అవార్డులను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా అందుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్టులు, బ్రాడ్‌కాస్టర్స్, మీడియా ఎగ్జిక్యూటివ్స్ హాజరయ్యారు. సమకాలిన అంశాలపై.. జాతీయ స్థాయిలో చర్చలు నిర్వహిస్తూ.. ప్రజలను చైతన్యపర్చడంలో ఇండియా ఎ హెడ్ న్యూస్ చానెల్ ఎంతో కృషి చేస్తూ వస్తున్నది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ప్రత్యేకమైన షోలతో ముందుకు దూసుకెళ్తున్నది. టాక్ టు భూపేన్ షో దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. సాంకేతికపరమైన అంశాలను అందిపుచ్చుకుంటూ.. ఉత్తమమైన ప్రోగ్రామింగ్‌ను ప్రదర్శిస్తూ.. జాతీయ స్థాయిలో తన కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ను సంపాధించుకుంది.
మేటి చానల్స్‌కు పోటీ పడుతూ..
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, జ్యూరీ చైర్మన్‌గా ఉన్నారు. ఎన్‌డీటీవీలాంటి న్యూస్ ఛానెల్‌తో సమానంగా పోటీపడుతూ.. ఇండియా ఎహెడ్ అనేక అవార్డులను జాతీయ స్థాయిలో సొంతం చేసుకుంది. అతి తక్కువ కాలంలో అసాధారణమైన కవరేజీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇతర ఆంగ్ల న్యూస్ ఛానెల్‌తో పోలిస్తే.. అనేక రంగాల్లో ఇండియా ఎహెడ్ అవార్డులు, గుర్తింపులు పొందింది. జర్నలిజం అనే పదానికి సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చింది. ఛానెల్ చేసిన కృషి.. చూపిన తెగువ.. పడిన తపన జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కారణమైంది. సామాజిక మాధ్యమాలను కూడా ఓ ఆయుధంగా ఉపయోగించుకుని.. సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేసింది. జాతీయ స్థాయిలో చేసిన ప్రసారం చేసిన ఎన్నో కథనాలు.. రాజకీయ రంగంలో చర్చకు దారితీశాయి. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ఎన్నో సంచలన కథనాలను ప్రసారం చేసింది. అవార్డు సొంతం చేసుకున్నందుకు గాను.. నిర్వాహకులకు ఇండియా ఎహెడ్ ఆంగ్ల న్యూస్ ఛానెల్ కృతజ్ఞతలు తెలిపింది.