తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని నిరూపిస్తే.. తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తానని సవాల్ విసిరింది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. 1857 ఫైట్ గురించి నాకు తెలుసు కానీ 1947లో ఎలాంటి యుద్ధం జరిగిందో నాకు తెలియదు. ఈ విషయంలో ఎవరైనా తనకు అవగాహన కల్పిస్తే.. పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేసి.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నానంటూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. తాజాగా భారతదేశానికి స్వతంత్రం బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్ష అని సంచలన కామెంట్ చేసింది. 1947 వచ్చినది నిజమైన స్వాతంత్రం కాదనీ, దేశానికి నిజమైన స్వాతంత్రం మోడీ ప్రధాని అయినా తరవాత 2014లోనే వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్ర వీరులను అవమనించేలా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లవెత్తాయి. ఈ క్రమంలో ఆమెకు ఇటీవల ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపేతర నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారి విమర్శలపై కంగనా స్పందించింది.
లోకల్ టు గ్లోబల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily