ప్రతి ఎన్నికల్లో ఓటు వేసే వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలికి అధికారులు సిరా వేయడం ఆనవాయితీ. కానీ త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల్లో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలికి సిరా వేయనున్నారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఎడమ చూపుడు వేలికి సిరా రాయగా.. ఆ గుర్తు ఇంకా పోకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీచేసింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి లోక్సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఈ స్థానానికి వచ్చే నెల 17న ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement