భారత సైన్యం దేశ సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరతను కాపాడేందుకు కట్టుబడి ఉందని, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే వెల్లడించారు. నేడు యుద్ధాలు జరుగుతున్న తీరులో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ.. కొత్త ఆయుధాలు, ఆధునిక పరికరాలతో సైన్యం తన సామర్థ్యాన్ని పెంచుకుందని అన్నారు.మా సైన్యం అప్రమత్తంగా ఉంది , సాధ్యమయ్యే ప్రతి ముప్పు కోసం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిష్టాత్మకమైన ‘ప్రెసిడెంట్స్ కలర్స్’ ప్రదానం చేసిన తర్వాత ఆర్మీ చీఫ్ నరవణే నాలుగు పారాచూట్ బెటాలియన్లను ఉద్దేశించి ప్రసంగించారు. దీనిని సైన్యంలో ‘నిషాన్’ గౌరవం అని కూడా అంటారు. భారత సైన్యం నేడు సవాలుతో కూడిన దశను ఎదుర్కొంటోందని ఆర్మీ చీఫ్ అన్నారు. మన సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు మీకు బాగా తెలుసు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు సైన్యం కట్టుబడి ఉంది. మేము అప్రమత్తంగా ఉన్నామని ,ఏదైనా ముప్పు కోసం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..