Monday, November 25, 2024

ఇండియా-పాక్ మ్యాచ్ వద్దన్న కేంద్ర మంత్రి అథ‌వాలే

T20: భార‌త్, పాక్ మ‌ధ్య ఈ నెల 24న టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌పై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అభ్యంత‌రం తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ ప్రోత్సాహంతో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆయ‌న గుర్తు చేశారు. అలాగే, వలస కూలీల హత్యోదంతాలు చోటు చేసుకుంటున్నాయ‌న్నారు.

ఓ వైపు ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటే మ‌రోవైపు భారత్‌, పాకిస్థాన్ మ‌ధ్య‌ మ్యాచ్ అంత మంచిది కాద‌ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. పాక్‌ ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోవ‌ట్లేద‌ని చెప్పారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఆప‌క‌పోతే పాక్‌పై భారత్ వార్‌ ప్రకటించాలని ఆయ‌న అన్నారు. కశ్మీర్‌లో అభివృద్ధి జ‌ర‌గ‌కుండా చూడాల‌ని పాక్ కుట్ర‌లు ప‌న్నుతోంద‌న్నారు అథ‌వాలే. ఇటువంటి స‌మ‌యంలో ఇరు దేశాల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌కూడ‌ద‌న్న విష‌యంపై బీసీసీఐ కార్యదర్శి జై షాతో తాను చర్చిస్తానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement