Monday, November 18, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఆకాశానంటుతోన్న వెండి

నేడు బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే ఏకంగా రూ.500 మేర పెరిగింది. దీంతో రూ.50 వేల మార్కు పైకి చేరింది. ప్రస్తుతం ఇక్కడ తులం గోల్డ్ రూ.50 వేల 300 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రూ.550 మేర పెరిగి హైదరాబాద్‌లో ప్రస్తుతం తులం రూ.54,880 వద్ద కొనసాగుతోంది. గత 3 రోజులుగా పెరగని బంగారం ధర ఇప్పుడు యూఎస్ ఫెడ్ సమావేశానికి ముందు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి మీద రూ.1000 పెరిగి రూ. 74 వేల మార్కుకు చేరింది. ఇక దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి ఒక్కరోజే ఏకంగా రూ.2 వేల మేర పెరిగింది.

దీంతో అక్కడ కూడా ఎన్నడూ లేని విధంగా కేజీ సిల్వర్ రూ.71 వేలకు పెరిగింది. దీంతో ఢిల్లీలో గత వారం రోజుల్లో సిల్వర్ రేటు ఏకంగా రూ.5,500 పెరగడం విశేషం. తర్వాత ఫెడ్ ప్రకటన భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటాక వచ్చింది. ఈ సారి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది యూఎస్ ఫెడ్. ఇటీవలి కాలంలో వరుసగా 75 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేటును నాలుగు సార్లు పెంచిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈసారి 50 బేసిస్ పాయింట్ల పెంపునకే పరిమితమైంది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 4.25 నుంచి 4.5 శాతానికి చేర్చింది. మొత్తంగా సున్నా వడ్డీ రేటును ఇంత శాతానికి చేర్చింది. 2023 వరకు మరో అర శాతం నుంచి ఒక శాతం వరకు వడ్డీ రేటు పెరిగే అవకాశాలున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement