తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. ఒక్కో బీరుపై 20 రూపాయలను పెంచిన ప్రభుత్వం… బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఒక్కో క్వార్టర్‌పై రూ.20 పెంచింది. ఇక బ్రాండ్‌తో నిమిత్తం లేకుండా ప్రతి హాప్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ మద్యం ధరను ఏకంగా రూ.80 దాకా పెంచింది. ఈ మేరకు బుధవారం రాత్రి తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు రేపటి (మే 19) నుంచే అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం ధరలను పెంచిన నేపథ్యంలో ఇవ్వాల (బుధవారం) రాత్రి మద్యం విక్రయాల గడువు ముగియగానే… ఆయా దుకాణాల్లోని మద్యంను అధికారులు సీజ్ చేయనున్నారు. ఆపై గురువారం నుంచి పెరిగిన మద్యం రేట్లను అమలులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
Breaking: మద్యం రేట్లు పెరిగినయ్.. 19వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి
Advertisement
తాజా వార్తలు
Advertisement