ప్రైవేటు బ్యాంక్ రంగానికి చెందిన ఐసీఐసీఐ తమ క్రెడిట్‌కార్డు ఛార్జీలను భారీగా పెంచింది. సవరించిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఐసీఐసీఐ పేర్కొంది. ఇక నుంచి అన్ని కార్డులపై 2.5శాతం ట్రాన్సక్షన్ ఫీజును వసూలు చేయనుంది. కనీస లావాదేవీ చార్జీ రూ.500గా తెలిపింది. బ్యాంక్ లేట్ పేమెంట్ ఛార్జీలను కూడా పెంచేసింది. ఐసీఐసీఐ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు మినహా ఇతర కార్డులు అన్నింటికి ఫిబ్రవరి 10నుంచి ఈవిధానాన్ని అమలుచేయనుంది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు రూ.100లోపు ఎటువంటి చార్జీలు వసూలు చేయదు. గరిష్ఠ లేట్ పేమెంట్ చార్జీని రూ.1200గా నిర్ణయించారు.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై ఔట్ స్టాండింగ్ మొత్తం రూ.50వేల కంటే ఎక్కువ ఉంటే ఈ చార్జీ వసూలు చేస్తారు. కార్డుపై బకాయి రూ.100నుంచి రూ.500ఉంటే వందరూపాయాలు చార్జీ, రూ501నుంచి 5వేలకు రూ.500చార్జీ, రూ.10వేలవరకు ఉంటే రూ.750, రూ.25వేలకు 900, రూ.50వేల బకాయికి వెయ్యి చార్జీ పడుతుంది. రూ.50వేలు అంతకన్నా ఎక్కువ ఉంటే రూ.1200 చార్జీ వసూలు చేయనున్నారు. కాగా క్రెడిట్ కార్డ్సుపై బకాయి మొత్తం రూ.50వేలకు మించి ఉంటే హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ రూ.1300, యాక్సిస్ బ్యాంక్ వెయ్యి వరకు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి