Thursday, November 21, 2024

ఉద్యోగుల గ‌రిష్ట వ‌యోప‌రిమితి ప‌దేళ్ల‌కు పెంపు – సీఎం కేసీఆర్

నేడు అసెంబ్లీలో ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు సీఎం కేసీఆర్. నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పారు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, అపోహాలు పోవడానికి యువకులకు స్పష్టత ఉండటానికి ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి ప్రతీ సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి పారదర్శకంగా ఉద్యోగ నియామకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింద‌న్నారు. ఈ మేరకు అన్ని విభాగాలు ఖాళీల వివరాలను సిద్ధం చేస్తాయని.. నోటిఫికేషన్ల జారీ కోసం నియామక సంస్థలకు సమాచారం ఇస్తాయని.. ఉద్యోగ ఆశావహులు ఆయా పరీక్షలకు పోటీ పడే విధంగా మధ్యలో తగిన వ్యవధి ఇస్తూ.. నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ అన్నారు. పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీస్ మినహా అన్నింటిలో వయో పరిమితి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట పరిమితి పెరుగుతుందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement