కొవిడ్-19 నుంచి రక్షణ పొందేందుకు తయారు చేసిన నాజిల్ వ్యాక్సిన్‌ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఇవ్వాల (సోమవారం) ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌కి భారత్ బయోటెక్ వారు ఇన్‌కోవాక్ (Incovacc)గా పేరు పెట్టారు. దీనికే BBV154 అనే మరో పేరుంది. ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు, ఆ పైబడిన వాళ్లకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వాలని సీడీఎస్‌సీఓ సూచించింది. దీంతో హెటిరోలాగస్ బూస్టింగ్ ఇవ్వనున్నారు.
హెటిరోలాగస్ బూస్టింగ్ అంటే..
మొదటి డోస్‌లో ఇచ్చిన వ్యాక్సిన్ కంటే భిన్నమైన వ్యాక్సిన్‌ను ఇవ్వడాన్ని హెటిరోలాగస్ బూస్టింగ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి దశ, హెటిరోలాగస్ బూస్టర్ డోసు అనుమతి పొందిన మొదటి వ్యాక్సిన్‌గా ఇన్‌వాక్ గుర్తింపు సాధించింది. మూడో దశ కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్‌లో ఇన్‌వాక్ సురక్షితమని, ఇమ్యూనిటీ పెంచుతుందని, దుష్పరిణామాలు ఉండవని తేలింది.
క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా మొదటి దశ, రెండో దశలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ‘ఇన్‌వాక్ వ్యాక్సిన్ అనేది ప్రైమరీ 2 డోసులో ముక్కులోపల ఇచ్చే వ్యాక్సిన్. కరోనాకు నాజల్ వ్యాక్సిన్ తయారుచేయడం పెద్ద విజయంగా భావిస్తున్నాం. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనది. దీన్నిఇచ్చేటప్పుడు ఏమాత్రం నొప్పి ఉండదు. అంతేకాదు కరోనా వేరియెంట్లకు తగ్గట్టుగా వ్యాక్సిన్ తయారు చేసే పనుల్లో ఉన్నాం’ అని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.