ప్రభన్యూస్ ప్రతినిధి, వరంగల్ : ఆకాలవర్షాలు, వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలల్లో ఒడిదొడుకులు, అనేక అవంతరాలు ఎదురైనప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని వ్యవసాయ మార్కెట్ల ఆదాయం లక్ష్యాన్ని చేరుకోనుంది. గడిచిన ఆర్దిక సంవత్సరంలో పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంబన ఏర్పడింది. అంతకు ముందు ఏడాది నుండి కరోనా వైరస్ వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం చూపింది. ఈ ఏడాది అకాలవర్షాలు పంట ఉత్పత్తులను దెబ్బతీసింది. అయినప్పటికి గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది పత్తి, మిర్చికి క్వింటాల్ ధర ఘణనీయంగా పెరిగింది. దీన్ని మార్కెట్ల రాబడికూడా పెరిగింది.అన్ని అవాంతరాలు ఎదురైనప్పటికి ఆదాయ సమీకరణలో మార్కెట్లు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోనున్నాయి. ఫిబ్రవరిమాసాంతం నాటికే వరంగల్ రీజియన్ లు 82 శాతం ఆదాయం సమకూర్చి వరంగల్ వ్యవసాయ మార్కెట్ రీజియన్ పరిధిలో రాష్ట్రంలోని 19 జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని 106 మార్కెట్ల ద్వారా ఈఆర్దిక సంవత్సరంలో రూ. 307 కోట్ల 26 లక్షల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫిబ్రవరి నెలాఖరు నాటికి రూ.252 కోట్ల 6 లక్షల ఆదాయం సమకూరింది. 82.03 శాతం లక్ష్యం సాధించింది. వరంగల్ జిల్లాలోని నాలుగు వ్యవసాయ మార్కెట్‌ల ద్వారా 36 కోట్ల 97 లక్షలకు గాను 40 కోట్ల 58 లక్షల ఆదాయం వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద ఏనుమాముల మార్కెట్ ఈ జిల్లాలోనే ఉంది. హనుమకొండ జిల్లాలోని 2 మార్కెట్‌లు ఉండగా 5 కోట్ల 5 లక్షల ఆదాయం లక్ష్యం కాగా 3 కోట్ల 64 లక్షలు, జనగామ జిల్లాలోని 4 మార్కెట్ల ద్వారా 8 కోట్ల 94 లక్షలకు గాను 3 కోట్ల 70 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలోని 3 మార్కెట్ల ద్వారా 10 కోట్ల 82 లక్షలకుగాను 5 కోట్ల 20 లక్షలు, భూపాలపల్లి జిల్లాలోని మార్కెట్ల నుండి 3 కోట్ల 88 లక్షలకు గాను 1 కోటి 83 లక్షలు,ములుగు జిల్లాలోని 1 మార్కెట్ నుంచి 4 కోట్లు, ఖమ్మం జిల్లాలోని 8 వ్యవసాయ మార్కెట్‌ల ద్వారా 2021-22 ఆర్దిక సంవత్సరంలో 36 కోట్ల 57 లక్షల ఆదాయం లక్ష్యం కాగా 29 కోట్ల 10 లక్షల ఆదాయం వచ్చింది.
కొత్తగూడెం జిల్లాలో 12 కోట్ల 92 లక్షల ఆదాయం టార్గెట్ కాగా 9 కోట్ల 7 లక్షలు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని 7 మార్కెట్‌ల నుంచి 13 కోట్ల 61 లక్షలకు గాను 9 కోట్ల 15 లక్షలు, పెద్దపల్లి జిల్లాలోని 8 మార్కెట్ల నుండి 14 కోట్ల 80 లక్షలు గాను 6 కోట్ల 80 లక్షలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 8 మార్కెట్లు 4 కోట్ల 94 లక్షల ఆదాయం లక్ష్యం కాగా 3కోట్ల 46 లక్షలు ఆదాయం వచ్చింది. జగిత్యాల జిల్లాలోని 13 వ్యవసాయ మార్కెట్ల నుండి 15 కోట్ల 24 లక్షల మార్కెట్ ఫీజు లక్ష్యంకాగా కేవలం 4 కోట్ల 61 లక్షలు, నల్లగొండ జిల్లాలోని 10 మార్కెట్ల నుండి 38 కోట్ల 4 లక్షలకు గాను 44 కోట్ల 40 లక్షల ఆదాయం ఫిబ్రవరి నాటికే వచ్చింది.
సూర్యపేట జిల్లాలోని 6 మార్కెట్లు భువనగిరి జిల్లాలోని 5 మార్కెట్‌లద్వారా 19 కోట్ల 28 లక్షలకు గాను 17 కోట్ల 15 లక్షలు ఆదాయం, ఆదిలాబాద్ జిల్లాలోని 5 మార్కెట్ల ద్వారా 21 కోట్ల 6 లక్షల ఆదాయం లక్ష్యం కాగా 20 కోట్ల 15 లక్షలు, ఆసిఫాబాద్ కొమురంభీమ్ జిల్లాలోని 3 మార్కెట్ల నుండి 9 కోట్ల 72 లక్షల ఆదాయం లక్ష్యం కాగా 10 కోట్ల 27 లక్షలు వచ్చింది. నిర్మల్ జిల్లాలోని 5 మార్కెట్ల నుండి 20 కోట్ల 50 లక్షలకు గాను 10 కోట్ల 61 లక్షలు, మంచిర్యాల జిల్లాలోని 5 మార్కెట్ల నుండి 12 కోట్ల 32 లక్షల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించగా, 11 కోట్ల 9 లక్షల ఆదాయం సమకూరింది.
–
నల్గొండ అత్యధికం…జగిత్యాల అత్యల్ఫం
వ్యవసాయ మార్కెట్‌ల ఫీజు వసూళ్లలో వరంగల్ ంీ జియన్ పరిధిలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ జిల్లాలోని 10 మార్కెట్ నుండి 38 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఫిబ్రవరి నాటికి 44 కోట్ల 40 లక్షల ఆదాయం వచ్చింది. 116 శాతం నమోదైంది. అత్యధికస్థానంలో వరంగల్ జిల్లా నిలిచింది. 4 మార్కెట్‌ల నుండి 36 కోట్ల 87 లక్షలకు గాను 40 కోట్ల 57 లక్షలు వచ్చింది. ఆదాయంలో జగిత్యాల జిల్లా చివరిస్థానంలో ఉంది. ఆ జిల్లాలో 13 మార్కెట్‌ల ద్వారా 15 కోట్ల 24 లక్షలఆదాయంకు గాను కేవలం 4 కోట్ల 62 లక్షలతో 30 శాతం నమోదైంది.