Sunday, November 24, 2024

Nisar: భూమిపై ఇంచ్ టు ఇంచ్ స్కానింగ్ చేసే శాటిలైట్.. ఇస్రో, నాసా కంబైన్డ్ ప్రాజెక్టుగా నిసార్

ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేష‌న్ (ISRO),  నేషనల్ ఎరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినేస్ట్రేషన్ (NASA) కలిసి చేస్తున్న కొత్త ప్రాజెక్టు పేరు నిసార్. ఈ ప్రయోగంలో భాగంగా పంపించే ఉపగ్రహం భూమి కదలికలు, త్రీడీ ఇమేజెస్, హెచ్ డీ ఫొటోస్ ని సేకరిస్తుంది. భూమిపై 0.4 ఇంచ్ వరకు ఉన్న ఇమేజెస్ ని క్యాప్చర్ చేసి వాటిని స్సేస్ స్టేషన్ కి అందజేస్తుంది. ఈ శాటిలైట్ ని 2023 జనవరి 29 ప్రయోగించేందుకు నాసా, ఇస్రో సన్నాహాలు చేస్తున్నాయి.

నిసార్ అనేది ఇస్రో, నాసా క‌లిసి చేపట్టిన ఉమ్మడి భూ ప‌రిశీల‌న కార్యక్రమం. నిసార్ పూర్తి పేరు నాసా-ఇస్రో-సార్‌. ఇక్కడ సార్ అంటే సింథ‌టిక్ అప‌ర్చర్ రాడార్‌. ఈ శాటిలైట్ భూమి ఉప‌రిత క‌ద‌లిక‌ల‌ను 0.4 ఇంచ్ వ‌ర‌కు కూడా గుర్తిస్తుంది. దీని ద్వారా నాసా భూ ఉప‌రిత‌ల మార్పుల‌ను అంచ‌నా వేయ‌నుంది. నిసార్ ప్రాజెక్టు ద్వారా పంపే ఉప‌గ్రహం హెచ్‌డీ చిత్రాల‌ను తీస్తుంది. ఈ రాడార్ రాత్రిళ్లు, దట్టమైన మేఘాలున్నప్పుడు కూడా స‌మాచారాన్ని గ్రహిస్తుంది. ఈ ఉప‌గ్రహం భూమిని ప్రతి 12 రోజుల‌కోసారి స్కాన్ చేస్తుందని అధికారిక సమాచారం. అంతేకాకుండా ఇది భూమి, స‌ముద్రాలు, మంచు ప‌ర్వతాల‌ను కూడా అబ్జర్వ్ చేస్తుంది. కాగా ఈ ఉపగ్రహం మూడేళ్ల పాటు కొన‌సాగే మిష‌న్‌గా అధికారులు తెలిపారు.

నాసా, ఇస్రో ఏం చేస్తాయంటే..

ప్రయోగానికి కావాల్సిన రాడార్‌ల‌లో ఒక‌టి నాసా అందిస్తుంది. అలాగే జీపీఎస్ రీసీవ‌ర్లు, పేలోడ్ డేటా స‌బ్ సిస్టమ్‌ను కూడా అందిస్తుంది. నిసార్‌లో అతిపెద్ద రిఫ్లెక్టార్ యాంటెన్నా కూడా ఉంటుంది. ఇంత పెద్ద యాంటెన్నాను నాసా ఇప్పటివ‌ర‌కు ప్రయోగించ‌లేదు. ఇక ఇస్రో స్పేస్ క్రాఫ్ట్ బ‌స్‌ను, రెండో రకం (ఎస్ బ్యాండ్‌) రాడార్‌ను, లాంచ్ వెహిక‌ల్‌ను, ఇత‌ర లాంచ్ సర్వీసుల‌ను అందిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement