Saturday, November 23, 2024

వందపడకల‌ ఆసుపత్రులు – ప్రారంభించిన‌ మంత్రులు హరిష్ రావు, పువ్వాడ అజయ్

ఖమ్మం : జిల్లా కేంద్రం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 7.50 కోట్ల రూపాయాలతో కార్డియాక్‌ ఎమర్జన్సీ సేవలు, ట్రామ కేర్ విభాగాన్ని ప్రారంభించారు ఆరోగ్య‌శాఖ మంత్రి హరిష్ రావు..కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యసేవలు అందిస్తున్నామ‌ని చెప్పారు.. ఈ మేర‌కు మధిర, సత్తుపల్లిలో వందపడకల‌ ఆసుపత్రులను ప్రారంభిస్తున్నట్లు మంత్రి హ‌రీష్ రావు చెప్పారు. కీమో థెరపీ, రేడియోథెరపీ సేవలను జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తామ‌న్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితం ఇచ్చిందన్నారు. మరోమారు రెండోదశ సర్వే కూడా కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్ల కరోనా టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామని, అవసరమైన ప్రతిఒక్కరికి కరోనా‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఖమ్మం జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని మంత్రి హరిష్ రావు పేర్కొన్నారు. వ్యాక్సిన్ సురక్షితమైందని, తప్పకుండా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. బూస్టర్ డోస్ అందించే సమయాన్ని 9 నెలల నుండి 3 నెలలకు వరకు తగ్గించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement