Sunday, November 24, 2024

Breaking: వరంగల్ జిల్లాలో.. బంగారం ధరను మించిపోయిన దేశీయ మిర్చి ధర

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దేశీయ మిర్చి ధర రికార్డు క్రియేట్ చేసింది. దేశీయ కొత్త మిర్చి రకానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. బంగారం ధరను మించిపోయింది. జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ లో దేశీయ మిర్చి ధర రూ.80,100లు పలికింది. ఏనుమాముల మార్కెట్ చరిత్రలోనే దేశీయ మిర్చికి అత్యధిక ధర ఇదే. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ.80,100 పలికి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.52 వేలు ఉండటంతో మిర్చి ధర బంగారం ధర కంటే ఎక్కువగా పెరిగిపోవడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుల్లో ఒకటైన వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌కు చపాటా, సింగిల్‌పట్టీ, తేజ, వండర్‌హాట్‌, దీపిక, 1048 రకం, 341 రకం మిర్చి వస్తుంటాయి. దేశీయ మిర్చికి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు కొనేందుకు ఎగబడ్డారు. గంటన్నరలోనే మూడు వేల బస్తాలు కొనుగోలు చేశారు. మార్కెట్ కు మిర్చి తక్కువగా రావడంతోనే అధిక ధర పలికిందని మార్కెట్ అధికారులు అంటున్నారు. అయితే ఎప్పుడూ లేనంతగా మిర్చికి ధర ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement