Tuesday, November 26, 2024

India | బీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్ సమక్షంలో.. గులాబీ పార్టీలో చేరిన ఎన్సీపీ నేత

బీఆర్ఎస్‌లోకి చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఎన్సీపీ నేత అభయ్ కైలాస్‌రావ్ చిక్టగోంకర్ బీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కండువా కప్పి అభయ్ కైలాస్‌రావ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్… పార్టీని బలోపేతం చేసే దిశగా వెళ్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ రోజురోజుకూ పుంజు కొంటున్నది. ఇప్పటికే కంధార్‌ లోహాలో బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతం అయింది. అక్కడి సభకు వేలాది మంది హాజరైన సంగతి తెలిసిందే.

ఇక గులాబీ పార్టీలో చేరికల జోరు కొనసాగుతున్నదనే చెప్పాలి. ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు బీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేల సంఖ్యలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలోకి చేరిక‌లు ఊపందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్ రావ్ చిక్ట‌గోంక‌ర్ చేరారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అభ‌య్ కైలాస్‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సీఎం కేసీఆర్ సాద‌రంగా ఆహ్వానించారు. ఔరంగాబాద్‌కు చెందిన అభ‌య్ కైలాస్‌ది రాజ‌కీయ కుటుంబం కాగా… అభ‌య్ కైలాస్ తండ్రి, తాత గ‌తంలో ఎమ్మెల్యేలుగా ప‌ని చేశారు. ఆయ‌న మామ మాజీ ఎమ్మెల్యే కాగా… అత్త మాజీ జ‌డ్పీ ప్రెసిడెంట్. 1998లో ఎన్ఎస్‌యూఐ ఔరంగాబాద్ విభాగానికి అభ‌య్ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. 2002-07 వ‌ర‌కు ఔరంగాబాద్ జ‌డ్పీ ప్రెసిడెంట్‌గా సేవ‌లందించారు.

- Advertisement -

ఇక ఆంధ్ర ప్రదేశ్‌లోనూ బీఆర్ఎస్ పార్టీ శాఖను ప్రారంభించిన కేసీఆర్.. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్ర శేకర్‌ను ప్రకటించారు. ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రక్రియను ముమ్మరం చేసిన సీఎం… ఒడిశాలోనూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర మాజీ సీఎం గిరిధర్ గమాంగ్‌ను గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్రలోనూ పావులు కపుతున్నారు గులాబీ బాస్.

బీఆర్ఎస్‌ పార్టీను మహారాష్ట్రలోనూ రిజిష్టర్ చేయించామని కేసీఆర్ ప్రకటించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని కేసీఆర్ ఇప్పటికే తెలిపారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి చూపిస్తానని వెల్లడించారు. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని వినతులు వస్తున్నాయన్న ఆయన… తర్వాత సభ షోలాపూర్‌లో పెడ్తామని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement