Friday, November 22, 2024

ట్విట్ట‌ర్ లో పిట్ట ప్లేస్ లో.. డోజీ మీమ్‌

నేడు ట్విట్ట‌ర్ ఓపెన్ చేసిన యూజ‌ర్ల‌కి బుల్లిపిట్ట స్థానంలో డాగ్ క‌నిపించ‌డంతో ఒక్కసారిగా షాకయ్యారు. ట్విట్టర్‌ హ్యక్‌ అయ్యిందో ఏమోనని కంగారుపడ్డారు. ట్విట్టర్‌ లోగో మారిందంటూ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీనిపై ట్విట్టర్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌ స్పందించారు. ట్విట్టర్‌ లోగోను మార్చేసినట్లు ధ్రువీకరించారు. ఇప్పుడు బ్లూ బర్డ్‌ పాతది అయిపోయిందని.. ఇకపై డోజీ మీమ్‌ ట్విట్టర్‌కు కొత్త లోగో అని వెల్లడించారు. ఈ మేరకు ఫన్నీ మీమ్‌ను ఎలన్‌ మస్క్‌ షేర్‌ చేశారు. దీంతో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ మరో ట్వీట్ కూడా చేశారు. ట్విట్టర్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది.. బ్లూకలర్‌లో ఉండే బుల్లిపిట్ట! నీలిరంగులో ఉండే ఆ పిట్ట బొమ్మ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఇకపై మీకు ట్విట్టర్‌లో ఆ బ్లూ బర్డ్ కనిపించదు. దాని స్థానంలో డోజీకాయిన్‌కు సంబంధించిన డోజీ మీమ్ దర్శనమిస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ట్విట్టర్‌ ఈ లోగోను మార్చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement