Sunday, November 17, 2024

ఎస్.టి.ఆర్ ట్రస్ట్ భవన్ లో – 25 వసంతాల వేడుకలు

తిరుగులేని వెండితెర కథానాయకుడిగా. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమై నిలిచిన ప్రజానాయకుడిగా… విశ్వవిఖ్యాతుడై వెలుగొందారు కీర్తి శేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేసి, పేదల పాలిటి పెన్నిధిగా, వారి ప్రేమాభిమానాలను పొందిన ఆ మహోన్నత చరితుని ఆశయాల సాధన కోసం, మానవస్వే పునాదిగా, “సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్ళు” అన్న ఆ మహానుభావునికి నివాళిగా. 1997లో దార్శనిక ప్రజానేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిర్భవించింది ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కే. రాజేంద్రకుమార్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు, ట్రస్ట్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కే. రాజేంద్రకుమార్ మాట్లాడుతూ గత 25 ఏళ్లలో ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల ప్రగతిని వివరించారు. నాటి నుండి నేటి వరకు ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత , జీవనోపాధి, విపత్తు నిర్వహణ , సాయం అనే నాలుగు ప్రధాన రంగాలలో సేవలందిస్తూ, సమాజంలో అందరూ సంతోషంగా జీవించేందుకు అవసరమైన సామాజిక మార్పు కోసం కృషి చేస్తోంది ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి , ట్రస్ట్ సేవాకార్యక్రమాల్లో భాగస్వాములైన సేవాతత్పరులకు, విరాళాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ 25 సంత్సరల సేవాకార్యక్రమాలు :

★ ఎన్.టి.ఆర్ ఆరోగ్యరథం పేరిట 23 వాహనాల ద్వారా పేదలకు ఉచిత ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు.

★ 10,942 ఉచిత వైద్యశిబిరాల ద్వారా రూ.17.29 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ

★ ఉచిత కంటివైద్య శిబిరాలు నిర్వహించి 18.55 లక్షల మంది గ్రామీణ నిరుపేదలకు ఉచిత కళ్లజోళ్లు, క్యాటరాక్ట్ సర్జరీలు .

- Advertisement -

★ హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో రక్తనిధి కేంద్రాలను నెలకొల్పి రెండు తెలుగు రాష్ట్రాలలో 7 లక్షల మంది ప్రాణాలు కాపాడాం.

★ 210 కార్పోరేట్ సంస్థలు, 40 సంస్థాగత భాగస్వాములతో స్వచ్చంద రక్తదాన శిబిరాలు..

★ తలసీమియాతో బాధపడే 80 మంది పిల్లలను దత్తత..

★ 1,35,197 యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందజేశాం (నిరుపేదలకు 71,897 యూనిట్లు, తలసేమియా బాధితులకు 17,358 యూనిట్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు 45,942 యూనిట్లు)..

★ గండిపేట, చల్లపల్లి ఎన్.టి.ఆర్ మోడళ్ల స్కూళ్ల ద్వారా అనాధ బిడ్డలు, తీవ్రవాద ఘటనల బాధితులకు ఉచిత విద్య …

★ 1,642 మంది అనాధ పిల్లలకు ఉచిత విద్య అందించి ఆత్మవిశ్వాసం గల పౌరులుగా ఎదిగేలా చేయూత…

★ ఇతర పాఠశాలల్లో చదివే నిరుపేదలకు రూ. 33లక్షల విలువైన ఉపకారవేతనాలు…

★ 4,159 మందికి మెరిట్ స్కాలర్ షిప్ లు అందజేత‌..

★ బాలికా విద్య ప్రోత్సాహంలో భాగంగా ప్రతిఏటా 25 మంది ప్రతిభావంతులైన విద్యార్ధినులను ఎంపికచేసి స్కాలర్ షిప్ లు ..

★ ఇప్పటిదాకా 175 మందికి రూ 1,48,00,000 లు స్కాలర్ షిప్ ల కింద ఇచ్చాం.

★ జాబ్ మేళాలు నిర్వహించి 4వేలమంది నిరుద్యోగులకు వివిధ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పించాం.

★ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాల ద్వారా 7,375 మందికి శిక్షణ ఇచ్చాం, వారిలో 2,500 మంది ఉద్యోగాలు పొందారు.

★ ఉటర్ సంస్థతో కలిసి 60 మంది డ్రైవర్లను వాహన యజమానులుగా చేశాం.

★ నిరుద్యోగులకు రూ 4 కోట్ల ఆర్ధిక సాయం అందించి స్వయం ఉపాధికి సహకరించాం.

★ కుట్టు కేంద్రాలు నెలకొల్పి ఉచితంగా కుట్టు పనిలో శిక్షణ ఇస్తున్నాం..

★ ఎన్.టి.ఆర్ సుజల కింద రెండు తెలుగు రాష్ట్రాలలో మూడున్నర లక్షల మందికి కేవలం రూ. 2కే 20 లీటర్ల సురక్షిత తాగునీటిని అందిస్తున్నాం.

★ 3 క్లస్టర్ మోడల్ ఆర్వో ప్లాంట్లు, 41 ‘ఇండివిడ్యువల్ ప్లాంట్లను నెలకొల్పాం.

★ ప్రకృతి విపత్తుల బాధితులు 20 లక్షల మందిని ఆదుకున్నాం.

★ మహబూబ్ నగర్, కర్నూలు వరదల్లో 54 వైద్యబృందాలతో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి రూ 15 కోట్ల విలువైన మందులు, దుస్తులు, దుప్పట్లను పంపిణీ చేశాం.

★ ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న 510 మంది తెలుగు యాత్రీకులను స్వస్థలాలకు క్షేమంగా చేర్చాం.

★ పైలాన్ తుపాన్ బాధితులు 17 వేల మందికి సహాయ పునరావాస చర్యలు చేపట్టాం.

★ హుద్ హుద్ తుపాన్ బాధితులు 50 వేల మందికి ఉచితంగా మందులు, పాలు-మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశాం.

★ హైదరాబాద్ వరదల్లో 10 బస్తీలలో 5 వేలమందికి చేయూత అందించాం.

★ కేరళ వరదబాధితుల పిల్లలకు 10 లక్షల నోట్ బుక్స్ పంపిణీ చేశాం.

★ కరోనా కష్టకాలంలో 20 వేల కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసరాలు, ఆహారపొట్టాలు అందజేశారు.

★ “మీతోనే..మీకోసం” కార్యక్రమం కింద అమెరికాలోని తెలుగు వైద్యుల భాగస్వామ్యంతో 1500 మంది కరోనా రోగులకు ఉచిత చికిత్స అందించాం. రూ.29లక్షల విలువైన మందులను అందజేశాం. 2 లక్షల మాస్క్ లు పంపిణీ చేశాం. రూ. కోటి 30 లక్షలతో ఏపిలో 2, తెలంగాణలో 1 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాం.

★ ఒమిక్రాన్ బాధితుల కోసం ఆన్ లైన్ టెలిమెడిసిన్ సేవలు ప్రారంభించాం.

★ స్థానిక వైద్యులతో పాటు 12 మంది ప్రవాస వైద్యుల సూచనలను అందించాం.

★ ఇటీవల వరద బీభత్సంలో అస్తవ్యస్తమైన తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలలో నిరాశ్రయులను ఆదుకున్నాం.

★ 50 వేల మందికి పాలు, తాగునీరు, ఆహార పొట్లాలు, బ్రెడ్, బిస్కట్లు, దుప్పట్లు, మందులు పంపిణీ చేశాం.

★ వరదల్లో మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ లక్ష చొప్పున 48 కుటుంబాలకు రూ 48 లక్షల ఆర్ధిక సాయం అందించాం.

★ అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో చిక్కుకున్న 5 గురిని ప్రాణాలకు తెగించి కాపాడిన శివప్రసాద్ కు రూ. లక్ష అందజేశామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement