ఒకే చోట వేల కొద్ది మొసళ్లు చేరాయి.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాస్త ఆలస్యంగా ఈ వీడియోని పోస్ట్ శారు. ఇటీవల బ్రెజిల్ బీచ్ పొడవునా వేల కొద్దీ మొసళ్లు ఒడ్డుకు వచ్చాయి. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా బీచ్ లో అటూ ఇటూ తిరుగుతూ సందడి చేశాయి. ఈ మొసళ్లకు సంబంధించిన డ్రోన్ వీడియోను కెన్ రుట్‌కోవ్ స్కీ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘బ్రెజిల్ లోని ఓ బీచ్ లో వేల కొద్దీ మొసళ్ల ఆక్రమణ ఇది. ఇది చూసి స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని క్యాప్షన్ పెట్టారు. భయం గొలిపేలా ఉన్న ఈ వీడియో త్వరగానే వైరల్ గా మారింది. ఏకంగా 80 లక్షలకుపైగా వ్యూస్ నమోదుకాగా.. లక్షల కొద్దీ లైకులు వస్తున్నాయి. ఆ మొసళ్లను చూస్తుంటే మనుషుల నుంచి నగరాన్ని ఆక్రమించుకునేందుకు మొసళ్లు వస్తున్నట్టుగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ఆక్రమణ కాదు. ఒకప్పుడు మనుషులు ఆక్రమించుకున్న తమ భూమిని తాము తీసుకోవడానికి ఆ జీవులు వస్తున్నాయని మరో నెటిజన్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement