Saturday, November 23, 2024

అమెరికాలో.. మ‌ల‌యాళీల చెండ మేళం

ఇండియ‌న్స్ ఎక్క‌డ ఉన్నా వారి సంప్ర‌దాయాలు.. సంస్కృతుల‌ను మ‌ర‌చిపోర‌న‌డానికి నిద‌ర్శ‌నంగా నిలిచింది ఈ వేడుక‌.
ఉత్తర అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో నివసించే కొంతమంది మలయాళీలు కేరళలో ప్రసిద్ధి చెందిన, మంత్రముగ్ధులను చేసే చెండా మేళంను తమ ముందుతరాలకు అందించాలనుకున్నారు. దీనికోసం కొంతమంది మలయాళీలు కలిసి తమ సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంజిత్ నాయర్ ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. అతను చెండ మేళంలో నిపుణుడైన వాద్యకారుడు. ఆయన పెన్సిల్వేనియా-న్యూజెర్సీ వాద్య వేదిక, త్రిరాష్ట్ర ప్రాంతానికి చెందిన పంచారీ మేళం సంగీత బృందంలో ప్రధాన గురువుగా ఉన్నారు. వీరి బృందంలో పురుషులు, మహిళలు ఇద్దరికీ శిక్షణా సెషన్‌లను ప్రారంభించారు. చెండ మేళం ప్రదర్శనలు మా కమ్యూనిటీ కార్యక్రమాలలో కేవలం సంగీతానికి అనుగుణంగా వాయిద్యం వాయించే వ్యక్తులతో చేసే ఓ ఈవెంట్‌గా ఉండేది. అలా కాకుండా చెండ మేళంకు ఉన్న ప్రాధాన్యతను కాపాడాలనుకున్నాం.

అందుకే మాలో కొందరు ఈ వాయిద్యాన్ని కేవలం వినోదంగా కాకుండా గౌరవంగా, అంకితభావంతో నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాం అని సంజిత్ నాయర్ చెప్పారు.గ్రూప్ సభ్యులు త్రిసూర్‌కు చెందిన కళామండలం శివదాస్ ఆశన్ నుండి శిక్షణ పొందుతున్నారు. వ్యక్తిగతంగా, ఆన్‌లైన్ తరగతులతో, కళామండలం శివదాస్ ఆశన్ చెండా మేళంపై పాఠాలను నేర్చుకోవడానికి ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఇది అంత తేలికైన విషయం కాదు… భుజానికి పెద్ద డ్రమ్ములాంటి డప్పు వేసుకుని.. నిలబడి రెండు చేతులతో బలమంతా ఉపయోగించి.. రిథమ్ కు అనుకూలంగా వాయించాలి. అందుకే మా చేతులు ఎంత నొప్పులు వచ్చినా, మా కాల్లు మొద్దుబారిపోతున్నా ప్రాక్టీస్ సమయంలో మేం ఎలాంటి కంప్లైంట్స్ చేయం. అందరికీ ఒకే దృఢ నిశ్చయంతో ఉంటాం” అని సంజిత్ నాయర్ అన్నారు. వీరి పట్టుదల, నిబద్ధత వల్ల న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో జరిగిన కేరళ పైరవి వేడుకల్లో వీరి ప్రదర్శన చేసేందుకు బృందాన్ని ఆహ్వానించడం గొప్ప విషయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement