రష్యా- ఉక్రెయిన్ మధ్య టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ అంతటా ఎమర్జెన్సీని విధించేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఆమోదించింది. అయితే దొనెట్స్, లుహాన్స్క్ ప్రాంతాలు ఇందుకు మినహాయింపు అని ఉక్రెయిన్ భద్రతాధికారి ఒకరు పేర్కొన్నారు.
ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎమర్జెన్సీ 30రోజుల వరకూ కొనసాగే చాన్స్ ఉందని, మరో 30 రోజులు కూడా పొడిగించొచ్చని తెలుస్తోంది.