హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ఇక మీదట గూబ గుయ్ మనేలా ఫైన్ వేయనున్నారు పోలీసులు. ఇప్పటిదాకా 100, 500 రూపాయలున్నా ఫైన్ ఇకపై 1700 రూపాయలకు చేరింది. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే వాహనదారులకు 1700 రూపాయల జరిమానా విధించనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్ చేసిన వారికి 1200 రూపాయల ఫైన్ వేయనున్నారు.
ఈ పెంచిన ఫైన్ ఈ నెల 28వ తేదీ నుంచి అమల్లోకి తెస్తామని పోలీసులు వెల్లడించారు. అందుకని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాహనదారులను కోరుతున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ రూల్స్‌ని పాటించకుండా బండి నడిపితే జేబుకు పెద్ద బొక్క పడే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు.