Tuesday, November 19, 2024

Weather Alert: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు​..

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్లు ఐఎండీ హైదరాబాద్‌లోని సైంటిస్ట్ సి ఇంచార్జి ఎ శ్రావణి తెలియజేశారు. IMD  తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ విదర్భ నుండి దక్షిణ అంతర్గత కర్నాటక వరకు ద్రోణి మరియు గాలి వేగం మందగించిందని,  పశ్చిమ విదర్భ నుండి ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు మరాఠ్వాడా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తున్న ఉన్నట్టు తెలిపింది. కాగా, ఉరుములు మెరుపులతో కూడిన వేగంతో (30-40 కి.మీ.) గాలులు వీచే అవకాశం ఉందని శ్రావణి తెలిపారు.

రాబోయే 24 గంటలపాటు హైదరాబాద్ వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 06-10 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి” అని శ్రావణి తెలిపారు. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్‌, 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement