Tuesday, November 26, 2024

High Alert | ఢిల్లీలో భారీ వర్షాలుంటయ్​.. ఎల్లో అలర్ట్​ జారీ!

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇవ్వాల (బుధవారం) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలుంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీతో పాటు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, జమ్ము కాశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్.. ముజఫరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్​ ద్వారా తెలియజేసింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వాతావరణంలో మార్పులతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటిముంపునకు గుర్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఢిల్లీ వాసులను హెచ్చరించింది. కొన్ని రోజులుగా ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా ఢిల్లీ నుంచి 10 విమానాలను దారి మళ్లించారు.

- Advertisement -

ఇక.. జూన్ 1వ తేదీ వరకు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జూన్ 1 వరకు ఈదురు గాలులు (40-50 నుండి 60 కిమీ వేగంతో).. ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. ఆ తర్వాత వర్షపాతం తీవ్రత తగ్గుతుందని ఐఎండీ తెలిపింది.

  •  బుధ, గురువారాల్లో  హిమాచల్ ప్రదేశ్.. ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయి.
  • ఉత్తరాఖండ్‌లో జూన్ 2వ తేదీ వరకు సుమారు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది.
  • హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్.. ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

హీట్‌వేవ్ ప్రిడిక్షన్

మే 31 నుండి జూన్ 4వ తేదీ వరకు బీహార్‌లో హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయి. మరోవైపు, గంగా నది పశ్చిమ బెంగాల్‌లో గురు, శుక్రవారాల్లో విపరీతమైన వేడి ఉంటుంది. సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ కూడా బుధ, శుక్రవారాల్లో హీట్‌వేవ్‌ విపరీతంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇక.. మహారాష్ట్రలో రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-4 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement