Tuesday, November 19, 2024

తెలంగాణలో నిప్పుల కొలిమి… మరో మూడు రోజులు భానుడి భగభగే

తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement