తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement