Tuesday, November 19, 2024

కర్నాటకలో మరో వివాదం.. ఎయిర్​ గన్​లతో బజరంగ్​దళ్​ శిక్షణ

కర్నాటకలో మరో వివాదం తలెత్తింది. బజరంగ్​దళ్​ సభ్యులు కొంతమంది ఆయుధాలతో శిక్షణ తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో సర్క్యులేట్​ అవుతున్నాయి.  శిక్షణా శిబిరానికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ లీడర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మతం పేరుతో హింసకు పాల్పడేలా శిక్షణ ఇస్తూ బజరంగ్ దళ్ యువత జీవితాలను నాశనం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు

అయితే.. బజరంగ్ దళ్ నాయకుడు రఘు సకలేష్‌పూర్ కొడగు శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది వాస్తవేమనని పేర్కొన్నారు. కార్యకర్తలలో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి వర్క్షాప్ నిర్వహించినట్టు తెలిపారు.  కర్నాటకలో బజరంగ్ దళ్ నిర్వహించిన ఆయుధ శిక్షణశిబిరం వీడియోలు, ఫొటోలు వైరల్ అయిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.

మే 5 నుంచి 11వ తేదీ వరకు కొడగు జిల్లా పొన్నంపేటలోని ఓ ప్రైవేట్‌ స్కూల్​లో బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో శౌర్య వర్క్ షాప్‌ నిర్వహించామని రఘు సకలేష్‌పూర్‌ చెప్పారు. ఇందులో 116 మంది కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు . శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వర్క్ షాప్‌ను నిర్వహించామన్నారు.  అయితే.. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎయిర్ గన్‌లు పట్టుకుని త్రిశూల్ దీక్షలో శిక్షణ తీసుకున్నారని కొంతమంది ఆరోపించారు. ఈ వాదనపై సకలేష్‌పూర్ స్పందిస్తూశిక్షణలో ఉపయోగించే ఎయిర్ గన్‌లు ,  త్రిశూల్ ఆయుధాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదని అన్నారు.  ప్రకృతి వైపరీత్యాల సమయంలో బరువులు ఎత్తడం, లాంగ్ జంప్, మంకీ రోప్, ఇతర కార్యకలాపాలలో శిక్షణ పొందారని, శిక్షణ కోసం ఎయిర్ గన్‌లను ఉపయోగించింది వాస్తవమే అని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement