Wednesday, November 20, 2024

మోదీ ఓ సూపర్ స్ప్రెడర్: ఐఎంఏ ఉపాధ్యక్షుడు

దేశంలో కరోనా కేసుల పెరుగుదలపై ప్రధాని మోదీపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు ప్రతిపక్షాలు మాత్రమే మోదీని విమర్శించాయి. కాని నిన్నటికి నిన్న ప్రపంచ మీడియా ప్రధాని తీవ్రంగా విమర్శింస్తూ కథనాలు ప్రచురించింది. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వేళ ఎన్నికలు జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీనే కరోనా వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేసే సూపర్ స్ప్రెడర్ అని అభివర్ణించారు ఐఎంఏ) ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలు ఏర్పాటు చేశారని, కుంభమేళాకు అనుమతించారని మోదీపై ఆరోపణలు చేశారు. వైద్య రంగం అంతా కొవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కలిగించే యత్నాలు చేస్తున్న వేళ ప్రధాని మోదీ మాత్రం భారీ బహిరంగ సభలు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. కరోనా మార్గదర్శకాలన్నింటినీ గాలికొదిలేశారు అని దహియా విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement