Tuesday, November 26, 2024

నేను కైవ్ లోనే ఉన్నా… వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీ తాను త‌మ దేశ రాజ‌ధాని కైవ్ లోనే ఉన్నాన‌ని తెలిపారు. తమ దేశ రాజధానిని కాపాడుకుంటామని జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీ ముఖ్య నాయకులతో కలిసి ప్రమాణం చేశారు. జెలెన్ స్కీ సెంట్రల్ కైవ్ నుంచి ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా తమ రాజధానిని రక్షించుకుంటామని ఆయన ఆ వీడియోలో తెలిపారు. ‘మేమంతా ఇక్కడే ఉన్నాం.. మా మిలిటరీ ఇక్కడే ఉంది.. సమాజంలోని పౌరులు ఇక్కడ ఉన్నారు.. మనమందరం మన స్వాతంత్ర్యం, మన దేశాన్ని కాపాడుకుందాం’ అని జెలెన్ స్కీ ప్రెసిడెన్సీ భవనం ముందు నిలబడి అన్నారు. ఆలివ్ ఆకుపచ్చ మిలిటరీ తరహా దుస్తులు ధరించిన జెలెన్ స్కీ.. తన ప్రధాన మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఇతర సీనియర్ సహాయకులతో కలిసి పుతిన్‎పై ఒత్తిడి పెంచేలా మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement