నర్సింగ్..పారామెడికల్ కాలేజ్ లో 130మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు.కొంతమంది విద్యార్థులు తమ హాస్టల్‌లోని మెస్‌లో ఆహారం తీసుకున్నారనీ, ఆ తర్వాత వారు కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు చేసుకోవడంతో ఇబ్బందులు పడ్డారు.
ఈ సంఘటన కర్నాటకలోని మంగళూరులోని శక్తినగర్‌లో చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 130 మంది విద్యార్థులు పలు ఆసుపత్రుల్లో చేరారు. ఏజే ఆస్పత్రిలో 52 మంది, కేఎంసీ జ్యోతిలో 18 మంది, యూనిటీ ఆస్పత్రిలో 14 మంది, సిటీ ఆస్పత్రిలో 8 మంది, మంగళ ఆస్పత్రిలో 3 మంది, ఎఫ్ఆర్ ముల్లర్స్ ఆస్పత్రిలో ఇద్దరు విద్యార్థులు చేరారు. నగరంలోని కనీసం ఐదు ఆసుపత్రుల్లో విద్యార్థులు చేరినట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్ శశికుమార్ తెలిపారు. కళాశాల అధికారులు విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది.ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. హాస్టల్ ను సందర్శించి వార్డెన్ తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుంటాం. విద్యార్థులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా హెల్త్ ఇన్స్పెక్టర్ డాక్టర్ అశోక్ తెలిపారు.
130మంది విద్యార్థులకి అస్వస్థత.. తప్పిన ప్రాణాపాయం
Advertisement
తాజా వార్తలు
Advertisement