Monday, November 18, 2024

కల్తీ క‌ల్లు… పెరుగుతున్న మృతుల సంఖ్య

మహబూబ్‌నగర్‌ క్రైమ్‌, ప్రభన్యూస్‌: మహబూ బ్‌నగర్‌ జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది… గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాలలో కల్తీ కల్లు తాగి ఇప్ప‌టికి ముగ్గురు మ‌ర‌ణించారు. అలాగే మ‌రో 50 మం దికి పైగా ప్రజలు అస్వ‌స్థ‌త‌తో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే కల్లులో అల్ఫ్రాజామ్‌ అనే మత్తుమందు కల పడం వల్లే అది తాగిన ప్రజలు పిచ్చి చేష్టలు చేస్తున్నా రని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కల్తీ కల్లు తాగిన వారిలో మెడ, తల వెనక్కిపోవడం, చేతు లు, కాళ్లు వణకడం, మూతి వంకరపోవడం లాంటి లక్షణాలతో పాటు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ గట్టిగా అరుస్తూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆస్ప త్రిలో చేరిన వారి సంఖ్య నాలుగు రోజులలో 50 మం దికి పైగా ఉండగా వీరిలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. కాగా, మహబూబ్‌నగర్‌ లో కల్తీ కల్లు జోరుగా విక్రయిస్తున్నారని, అది తాగిన ప్రజలకు డోస్‌ ఎక్కువై పిచ్చిచేష్టలు చేస్తున్నారని బాధి తుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధు తుల వివరాలు ఆస్పత్రి అధికారులు గోప్యంగా ఉంచు తున్నారు. ఈ విషయంపై వివరాలు తెలుసుకునేందు కు జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వెళ్లిన మీడియాపై ఆస్పత్రి అధికారులు ఆంక్షలు విధిస్తూ లోపలికి అనుమతించకపోవడంతో బుధవారం ఉదయం మీడి యా ప్రతినిధులకు ఆస్పత్రి అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనపై ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ రామ్‌కిషన్‌ స్పందించి మీడి యాతో మాట్లాడారు. గత నాలుగు రోజులుగా కొంత మంది ప్రజలు పిచ్చిపిచ్చి చేష్టలతో ఆస్పత్రిలో చేరా రని, సుమారు 40మంది ఆస్పత్రిలో చేరితే వారిలో 30మందికి మెరుగైన వైద్యం అందించి ఇంటికి పంపిం చామని పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు చనిపోగా నలుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, మరికొంతమందికి సాధారణ వైద్యం అందిస్తున్నా మని వెల్లడించారు. అయితే బాధితులు ఆల్కహాల్‌ తీసుకోవడం వల్లే ఇలా చేస్తున్నారని, పూర్తి వివరాలు ఫోరెన్సిక్‌ రిపోర్ట్టు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా.. అది తాగిన ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రి పాలవు తున్నా.. జిల్లాలో ఎక్సైజ్‌ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారుల తీరు పట్ల జిల్లా ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రతిప క్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయ కులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement