కడప జిల్లా సంబేపల్లి చెరువులోని మట్టిని అక్రమ రవాణా కొనసాగుతోంది. చెరువులోని మట్టిని అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తరలిస్తున్నారని సమాచారం రావడంతో రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో గతంలో మట్టి తరలింపు అడ్డుకున్నారు. అయితే, అదే రెవెన్యూ అధికారులు నేడు వ్యవసాయానికి రైతు మట్టి తోలుకోవడానికి అంటూ అనుమతులు ఇచ్చారు. రెవిన్యూ అధికారులు అనుమతులు ఇవ్వడంతో యధేచ్చగా పట్టపగలే జెసిబి సహాయంతో ట్రాక్టర్ల ద్వారా సంబేపల్లి చెరువు నుండి వందల ట్రిప్పులు మట్టిని తరలిస్తున్నారు. 15 రోజుల క్రితం దేవపట్ల గ్రామంలోని జమ్మి చెట్టు కుంట నుండి రాత్రి సమయంలో సంబేపల్లి గ్రామంలో రియల్ ఎస్టేట్ కొరకు 1000 మట్టిని తరలించారు. అప్పట్లో ఓ వర్గం వారు మట్టి తరలింపు అడ్డుకోవడంతో నిలిపివేశారు. ఈ మధ్యకాలంలో ఏమి ఒప్పందం జరిగిందో గానీ శుక్రవారం రెవెన్యూ అధికారుల అనుమతితో మట్టి తరలింపు షురూ చేశారు.
వ్యవసాయ పొలానికి సారవంతమైన మట్టి తొలగిపోవడానికి రెవెన్యూ అధికారులు అనుమతిస్తే దానిని అడ్డుపెట్టుకొని వేల టిప్పులు మట్టిని రియల్ ఎస్టేట్ కు తరలిస్తున్నారు. చెరువుల్లో మట్టి తరలింపు కొరకు మైనర్ ఇరిగేషన్ అధికారుల నుండి అనుమతులు తప్పని సరిగా వుండాలి. ఈ విషయంపై మైనర్ ఇరిగేషన్ డి ఈని వివరణ కోరగా సంబేపల్లి చెరువు నుండి మట్టి తరలింపుకు ఎవరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. తాహసిల్దార్ వివరణ కోరగా వ్యవసాయ పొలానికి సారవంతమైన మట్టి తరలించడానికి కొన్ని టిప్పు లకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.