ఆపరేషన్ స్మైల్ లో అక్రమ దందాలు వెలుగు చూశాయి. అడ్డంగా దోచుకుంటున్నారు అధికారులు. కామారెడ్డి జిల్లాలో అధికారుల దందా బయటపడింది. కేసుల పేరుతో షాపుల యజమానులకు బెదిరింపులు. సెటిల్ మెంట్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు అధికారులు. ఫోన్లు చేసి బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. చిన్నారుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు అధికారులు. చిన్నారుల మోములో చిరునవ్వులు వికసించాలన్న ప్రధాన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అడ్డదారులు తొక్కుతోంది. తప్పిపోయి నిరాదరణకు గురయిన చిన్నారులు, వెట్టి చాకిరీలో మగ్గుతున్న బడి ఈడు బాలకార్మికులను చదువుబాటలో నడిపించడమే దీని ఉద్దేశం. బాలల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ స్మైల్ పేరుతో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ దందాతో మారిపోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..