Monday, November 25, 2024

Technology | ఇక స్టాక్​ మార్కెట్లోనూ భూముల అమ్మకాలు, కొనుగోలు.. సాఫ్ట్​వేర్​ రూపొందించిన ఐఐటీ కాన్పూర్​

ఇప్పటివరకు స్టాక్​ మార్కెట్​లో లిస్టెడ్​ కంపెనీలకు చెందిన స్టాక్స్​ని కొనుగోలు చేయడం, అమ్మేయడం వంటి కార్యకపాలు జరుగుతాయన్నది అందరికీ తెలుసు.. కానీ, ఐఐటీ కాన్పూర్​ వాళ్లు డెవలప్​ చేసిన ఈ కొత్త సాఫ్ట్​వేర్​తో ఇకమీదట స్టాక్​ మార్కెట్​లో భూములను కూడా అమ్మడం, కొనుగోలు చేయడం వంటివి చేయవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఐఐటీ-కాన్పూర్, కాన్పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (కేడీఏ)కలిసి అభివృద్ధి చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో స్టాక్ మార్కెట్‌లో ఇకమీదట భూముల విక్రయాలు చేపట్టనున్నారు. ఇట్లా చేసిన మొదటి ప్రభుత్వ సంస్థ కూడా కాన్పూర్​ డెవలప్​మెంట్​ అథారిటేనే అవుతుంది. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏడు రకాల పనులకు గాను ఉత్తమ అవార్డు కూడా దక్కింది.

ఇక.. IIT వారు అభివృద్ధి చేసిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి ప్రభుత్వ అధికారం సంస్థగా  KDA అవతరించింది. సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన ప్రత్యేకతను కేడీఏ వైస్ చైర్మన్ అరవింద్ సింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రాతో షేర్​ చేసుకున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా నగరవాసులకు కూడా ఎంతో ఊరట లభిస్తుందని ప్రజెంటేషన్‌లో తెలియజేశారు. భూ యజమానులు తమ సౌలభ్యం ప్రకారం స్టాక్ మార్కెట్‌లో ప్రజల ఉపయోగం కోసం భూమిని విక్రయించవచ్చు లేదా దానిని బదిలీ చేయవచ్చు.

IIT కాన్పూర్​ వారు రూపొందించిన ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రస్తుతం KDAకి నాలెడ్జ్ పార్టనర్‌గా ఉంది. కాన్పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న పనులు దేశంలోని సెవెన్​ బెస్ట్​ ప్రాక్టీస్​ వర్క్స్​కి ఎంపికయ్యాయి. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి, హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి చర్చ కోసం ఈ విషయంలో ఒక లేఖ కూడా పంపించారు. 

- Advertisement -

కాగా, లక్నోలో చేసిన ప్రెజెంటేషన్‌లో కాన్పూర్​ డెవలప్​మెంట్​అథారిటీ (కేడీఏ) వీసీ మాట్లాడుతూ.. పథకం అమలులో ప్రజల ఉపయోగం కోసం భూమి ఉపయోగకరంగా ఉన్నట్టు అయితే దాని యాజమాన్యం ప్రైవేట్ భూ ​​యజమాని వద్ద ఉందని, అప్పుడు దానిని రివ్యూ చేయవచ్చని తెలిపింది. కొనుగోలు చేసిన క్రమంలోఆ భూమి హక్కులకు సంబంధించిన సర్టిఫికేట్ బదిలీ చేయవచ్చని తెలుస్తోంది.

IIT కాన్పూర్ ఆధ్వర్యంలో నిర్వహించే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ట్యాంపరింగ్ లేదా ఏదైనా అక్రమ కార్యకలాపాలు జరగకుండా దీన్ని రూపొందించారు.  ప్రజల కోసం అద్భుతమైన పనిచేసిన దేశం నలుమూలల నుండి ఏడు ప్రభుత్వ శాఖల నుండి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏడు పద్ధతులను ఎంపిక చేసింది. ఇందులో భూ యాజమాన్యం, అక్రమ ఆక్రమణ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని, ఐఐటీ సాంకేతికతను ఉపయోగించుకున్నందుకు కేడీఏ ప్రశంసలు అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement