బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై నటుడు సిద్ధార్థ్ చేసిన సెక్సిస్ట్ ట్వీట్‌ను న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా ఉల్లంఘనలపై సైనా ఆందోళన వ్యక్తం చేశారు. కాన్వాయ్ వెళ్లే రూట్ లో నిరసనల కారణంగా 20 నిమిషాల పాటు పీఎం వేహికల్స్ ఫ్లైఓవర్‌పై వేచి ఉండాల్సి వచ్చింది. దీనికి నటుడు సిద్ధార్థ్ ‘‘సబ్టిల్ కాక్ చాంపియన్ ఆఫ్ వరల్డ్… గాడ్ థ్యాంక్స్.. గాడ్ ఆఫ్ ఇండియా ప్రొటెక్టర్స్ చేతులు ముడుచుకున్నారు. సిగ్గుపడాలి’’ అని చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది..
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిగా గతంలో ఉన్న రిజిజు నెహ్వాల్‌ను ‘‘ఒలింపిక్ పతక విజేత కాకుండా స్థిరమైన దేశభక్తురాలు” అని తన ట్వీట్ లో ప్రశంసించారు. భారత్‌ను స్పోర్ట్స్ పవర్‌హౌస్‌గా మార్చడంలో సైనా నెహ్వాల్ అద్భుతంగా కృషి చేసినందుకు భారతదేశం గర్విస్తోంది. ఆమె ఒలింపిక్ పతక విజేతగానే కాకుండా దృఢమైన దేశభక్తురాలు… అలాంటి ఐకాన్ పర్సనాలిటీపై చవక వ్యాఖ్యలు చేయడం.. ఒక వ్యక్తి నీచమైన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది’’ అని రిజిజు తన ట్వీట్ లో పేర్కొన్నారు.