ఓ మసీదులో రంజాన్ ప్రార్థనల అనంతరం ఇప్తార్ విందులో పాల్గొన్న వందమందికి పైగా అస్వస్థతకి గురయ్యారు. దాంతో వారిని కోల్ కతాలోని పలు హాస్పటల్స్ లో చేర్పించారు. కాగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కుల్తాలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పఖిరలయ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. రాత్రి కొందరు కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ తమ క్లినిక్‌కు వచ్చారని, ఇఫ్తార్ విందులో పాల్గొన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతో వారు అస్వస్ధతకు లోనయ్యారని తెలిసిందని డాక్టర్ హరిసూధన్ మొండల్ చెప్పారు. పవిత్ర రంజాన్ మాసం తొలి రోజునే ఈ విషాధ ఘటన చోటుచేసుకోవడం, రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ఈ ఘటనలో అస్వస్ధతకు గురైన ఓ వ్యక్తి భార్య నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement