Friday, November 22, 2024

ప‌ర్మిష‌న్ లేకుండా రెడ్ హార్ట్ ఎమోజీని వాట్సాప్ లో పంపితే – రూ.20ల‌క్ష‌ల జ‌రిమానా

సౌదీ అరేబియా వాట్సాప్ యూజ‌ర్ల‌కు ఒక ష‌ర‌తుని విధించింది. వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీని ఎదుటి వ్య‌క్తి ప‌ర్మిష‌న్ లేకుండా పంపిస్తే వేధింపుల‌తో స‌మాన‌మైన నేరంగా తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన యాంటీ ఫ్రాడ్‌ అసోసియేషన్‌ సభ్యుడు అల్‌ మోతాజ్‌ కుత్బీ ప్ర‌కటించారు. ఇలా రెడ్‌ హార్ట్‌ ఎమోజీని పంపించిన వారికి 1 లక్ష సౌదీ రియల్స్‌.. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 20 లక్షల జరిమానాగా విధిస్తారు. ఒకవేళ ఇదే నేరంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు దోషిగా తేలితే ఏకంగా రూ. 60 లక్షల రూపయాలతో (3 లక్షల రియల్స్‌) పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు.ఇదిలా ఉంటే సౌదీలో ఎదుటి వాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్‌ చేయడాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే రీతిలో మెసేజ్‌లు చేసినా నేరమే. ముఖ్యంగా రెడ్‌ హార్ట్‌ ఎమోజీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అల్ మోతాజ్ కుత్బీ సూచించారు. ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగిస్తే దాన్ని సౌదీ అరేబియా చట్టం ప్రకారం వేధింపుల కింద పరిగణిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement