Saturday, November 23, 2024

Spl Story | శరీరంలోని ఈ అయిదు భాగాల్లో వాపు కనిపిస్తే.. హెల్త్​ పరిస్థితి ఏంటో తెలుసా!?

శరీరంలో తలెత్తే కొన్ని సమస్యలను పరిశీలించి వారి ఆరోగ్య పరిస్థితి ఈజీగా కనిపెట్టొచ్చు అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే.. మానవ శరీరంలోని ఈ అయిదు భాగాల్లో వాపు కనుక కనిపిస్తే వారి ఆరోగ్యం మెల్లగా దెబ్బతింటోందని అర్థం చేసుకోవాలి. మరి, ఇటువంటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవర్ని సంప్రదించాలి. ఆ అయితు భాగాలు ఏవి అన్నదాని గురించి సమగ్రంగా తెలుసుకుందాం..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మానవ శరీరం అనేక సంక్లిష్ట వ్యవస్థల సమాహారం. ఈ వ్యవస్థలో ఎక్కడ అనారోగ్యం తలెత్తినా అది ఇతర భాగాలపై ఎఫెక్ట్​ చూపుతుంది. మన శరీర భాగాల్లో అప్పుడప్పుడు వాపు కనిపించడం గమనిస్తూనే ఉంటాం. ప్రత్యేకించి శరీరంలోని ఈ అయిదు భాగాల్లో వాపు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తొడలు, పిక్కలు, మడమలు, చేతి వేళ్లు, పొట్ట భాగాల్లో వాపు కనిపిస్తే ఈజీగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఆ వాపులు కాలేయం తీవ్ర అనారోగ్యం బారిన పడింది అన్నదానికి సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారిలో ఈ రకమైన వాపులు కనిపిస్తాయి. 


శరీరంలో అత్యంత కీలక అవయవం కాలేయం. ఇది మానవ దేహంలో 500కి పైగా జీవ క్రియలకు తోడ్పాటు అందిస్తుందిం. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం, వ్యాధులతో పోరాటం, రక్తం నుంచి విషపూరిత మలినాలను తొలగించడం వంటి అత్యంత కీలక చర్యలను కాలేయం నిర్వర్తిస్తుంది. అలాంటి కాలేయానికి ఏదైనా హాని జరిగితే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయి.  సరైన ఆహారపు అలవాట్లు లేనివారిలో, చెడు తిండి తినేవారిలో, శరీరానికి తగినంత వ్యాయామం లేనప్పుడు, అధిక బరువుతో బాధపడేవారిలో కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఈ పరిస్థితిని ఫ్యాటీ లివర్ గా పరిగణిస్తారు. 

ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయం పనితీరు మందగించి శరీర జీవక్రియలు అస్తవ్యస్తం అవుతాయి. సిరోసిస్ అనేది ఫ్యాటీ లివర్ లో చివరి దశ. ఇది ప్రాణాంతకమైనది. కాలేయం సిరోసిస్ దశకు చేరుకున్నప్పుడు శరీరంలో ఐదు భాగాల్లో వాపు కనిపిస్తుంది. 
కాలేయం సరిగా పనిచేయనప్పుడు పరిమాణంలో మరింత పెరిగినప్పుడు నరాలపై ఒత్తిడి పడుతుంది. కాలేయంలో రక్త సరఫరాకు అవాంతరాలు ఏర్పడతాయి. దాంతో కిడ్నీలకు రక్త సరఫరా తగ్గడం, కిడ్నీలు రక్తంలో పేరుకుపోయిన అధికమోతాదులో ఉన్న లవణాలను తొలగించలేకపోవడం జరుగుతుంది. ఈ కారణంగానే తొడలు, పిక్కలు, మడమలు, పొట్ట, చేతి వేళ్లలో వాపు ఏర్పడుతుంది. 

చాలామంది పొట్ట ఉబ్బినప్పుడు గ్యాస్ సమస్య అనుకుంటారు. సుదీర్ఘకాలం పాటు పొట్ట ఉబ్బుగా ఉంటే లివర్ సిరోసిస్ కోణంలోనూ దీన్ని పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లివర్ సిర్రోసిస్ కు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అది కేన్సర్ గానూ, లివర్ ఫెయిల్యూర్ గానూ పరిణమించి ప్రాణాలు పోయేందుకు దారితీస్తుంది. అందుకే, ఈ ఐదు శరీర అవయవాల్లో వాపు కనిపిస్తే వెంటనే డాక్టర్​ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్​ సూచించిన విధంగా మందులు వాడడం కానీ, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement