Thursday, November 21, 2024

ఆయుష్మాన్​లో చేరలేదని రుజువు చేస్తే రాజీనామా చేస్తా.. లేకుంటే తప్పయిందని నిర్మల ఒప్పుకోవాలే: హ‌రీశ్‌రావు

ఆయుష్మాన్​ భారత్​లో తెలంగాణ రాష్ట్రం చేరలేదని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది నిజమని రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానన్నారు మంత్రి హరీశ్​రావు. లేకుంటే కేంద్ర మంత్రి నిర్మల ‘‘తప్పయ్యిందని”బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

ఈ మ‌ధ్య తెలంగాణ‌కు వ‌స్తున్న కేంద్ర మంత్రులు అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, వారు గోబెల్స్‌నే మించిపోయార‌ని హేళ‌న చేశారు మంత్రి హ‌రీశ్‌రావు. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ హాస్య‌స్పదంగా మాట్లాడుతున్నార‌ని, రేష‌న్ షాపు ముందు మోదీ ఫొటో పెట్ట‌మ‌ని అడ‌గ‌డం ఏంట‌ని అన్నారు. పేదలకు ఉచితంగా ఇచ్చే బియ్యం కోసం తాము 3, 610 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు స్ప‌ష్టం చేశారు. ఇవ్వాల (శుక్ర‌వారం) మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ ప‌లు అంశాల‌ను ట‌చ్ చేశారు.

ఇక‌.. దేశాన్ని సాదే 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంద‌ని, మ‌రి కేంద్రంలో కూడా సీఎం కేసీఆర్ ఫొటో పెట్టాలి క‌దా అని మంత్రి హ‌రీశ్ అడిగారు. కేంద్రానికి రాష్ట్రం నుండి పోయిన ఆదాయం ఎక్కువ, రాష్ట్రానికి వచ్చిన వాటా తక్కువగా ఉంద‌న్నారు. బీజేపీ వాళ్లు చెప్పేవ‌న్నీ ఉత్త బోగస్ మాటలని, తాము చెప్పేది నగ్న సత్యం అన్నారు. ఈ మధ్య రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు మొత్తం అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు.

కాళేశ్వరం ద్వారా ఒక్క ఏకరం పారలేదు అని మొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నాడు.. ఇంత పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడతారని ప్ర‌శ్నించారు మంత్రి హ‌రీశ్‌.. బీజేపీ వాళ్లు దివాలాకోరు, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నార‌న్నారు. కాగా,
కేంద్ర మంత్రి నిర్మాలకు తాను సవాల్‌ విసురుతున్నాన‌ని, తెలంగాణ రాష్ట్రం అయష్మన్ భారత్‌లో చేరలేదు అని రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తాన‌న్నారు. లేదా తప్పు మాట్లాడినందుకు ‘‘తప్పు అయ్యింది’’ అని నిర్మల సీతారామన్ ఒప్పుకోవలన్నారు మంత్రి హరీశ్​రావు. అబద్ధాల ప్రచారంలో బీజేపీ గోబల్స్ ను మించి పోయిందని, నోబెల్ బహుమతి ఇవ్వాలని చురకలంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement