రైతుల కొడుకులను పెళ్లి చేసుకుంటే.. రూ.2లక్షల నజరానా ఇవ్వాలని జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ఓట్ల వేటలో నేతలు హామీలు గుప్పిస్తున్నారు. ఆ హామీల్లో రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే మహిళలకు తమ పార్టీ రూ.2 లక్షలు అందజేస్తుందని జేడీ(ఎస్) నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు.
కోలార్‌లోని పంచరత్నలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కుమారస్వామి మాట్లాడుతూ.. రైతుల పిల్లల పెండ్లిండ్లను ప్రోత్సహించేందుకు వారిని వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చిన యువతులకు ప్రభుత్వం రూ.2 లక్షల నగదు అందించాలని కోరారు. రైతుల కుమారులను పెండ్లి చేసుకునేందుకు యువతులు సుముఖంగా లేరని తన దృష్టికి వచ్చిందని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ పథకం అమలు చేస్తే మన యువకుల ఆత్మ గౌరవాన్ని కాపాడవచ్చని అన్నారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.