Friday, November 22, 2024

ప్రేమిస్తే.. ఆ ప‌నికి ఒప్పుకున్న‌ట్టు కాదు: కేరళ హైకోర్టు

కేర‌ళ కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని నేటి త‌రం యువ‌త మ‌స‌లుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇద్ద‌రు ప్రేమికుల కేసులో కేర‌ళ ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.. ప్రేమించినంత‌ మాత్రాన ఆ ప‌నికి ఒప్పుకున్న‌ట్టు కాదని కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నాం అంటే అతడితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కాదని స్పష్టం చేసింది ధ‌ర్మాస‌నం. ఒకవేళ అలా భావించి బలవంతంగా సంబంధం పెట్టుకుంటే అది కిడ్నాప్, అత్యాచారం కిందికే వస్తుందని జస్టిస్ ఆర్. నారాయణ పిషరది నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

నిస్సహాయ స్థితిలో, గత్యంతరం లేక ఆమె అంగీకరించి లైంగిక సంబంధంలో పాల్గొంటే అది అంగీకరిస్తున్నట్టు కాదని, అంగీకారానికి, లొంగుబాటుకు మధ్య ఉన్న తేడాను గుర్తించాలని పేర్కొంది ధ‌ర్మాస‌నం పేర్కొంది. శ్యాం శివన్ (26) తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై ఆ ప‌నికిపాల్పడ్డాడు. ఆపై ఆమె నగలు విక్రయించి గోవా తీసుకెళ్లి అక్కడ మరోమారు ఆ ప‌నిచేశాడు. తనతో వచ్చేందుకు ఒప్పుకోకుంటే ఆమె ఇంటి ముందే సూసైడ్‌ చేసుకుంటానని బెదిరించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె అతడితో వెళ్లింది.

ఈ ఘటనపై కేసు నమోదు కాగా, ఆమె తనతో వచ్చేందుకు కానీ.. ఆ తర్వాత జరిగిన దానికి గానీ ఆమె ఎక్కడా ప్రతిఘటించలేదని.. దీంతో ఆమె అంగీకారంతోనే అంతా జరిగిందని నిందితుడు కోర్టుకు తెలిపాడు. అయితే.. అతడి వాదనను సమర్థించని ట్రయల్ కోర్టు నిందితుడికి అత్యాచార నేరం కింద శిక్ష విధించింది. దీంతో నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా అక్కడా కూడా అతడికి ఎదురుదెబ్బే తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అయితే.. బాధితురాలి వయసు విషయంలో సరైన నిర్ధారణ లేకపోవడంతో పోక్సో చట్టం కింద నమోదైన కేసును మాత్రం కోర్టు కొట్టివేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement