Friday, November 22, 2024

మాంసాహారం మంచిదికాదు, తప్పుడు దారిలో నడిపిస్తుంది.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​భగవత్

తప్పుడు ఆహారాన్ని(నాన్​వెజ్​), జంతువులను చంపి తినడం వంటిది అంత మంచిది కాదన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) చీఫ్​ మోహన్​ భగవత్​. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ నాన్​వేజ్​ తినొద్దని సూచించారు. ఆర్​ఎస్​ఎస్​కు అనుబంధంగా ఉన్న భారత్​ వికాస్​ మంచ్​ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడారు.”మీరు తప్పుడు రకం ఆహారం తింటే, అది మిమ్మల్ని తప్పుదారిలో నడిపిస్తుంది.  నాన్​వేజ్​ తినకూడదు, జంతువులను హింసించి, క్రూరంగా చంపి వండిన ఆహారం హల్త్​కి అంత మంచిది కాదు అన్నారు.

పాశ్చాత్య దేశాలలో నాన్ వెజ్ తినేవారికి, భారతదేశంలోని వారికి మధ్య పోలికను చూపారు మోహన్​ భగవత్​. దేశంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో మాంసం తినే ప్రజలు ఉన్నారని, కానీ. మన దేశంలో మాంసాహారులు కూడా కొంత సంయమనం పాటిస్తారన్నారు. అయితే దీనికి వారు కొన్ని నియమాలను అనుసరిస్తారని తెలిపారు. ఇక్కడ మాంసాహారం తినే వ్యక్తులు శ్రావణ మాసం మొత్తం మాసం తినరని,అంతేకాకుండా సోమ, మంగళ, గురు, శనివారాల్లో కూడా కొంతమంది మాంసాహారం తినరన్నారు. ఇట్లాంటి విషయాల్లో తమకు తాముగా కొన్ని నియమాలు విధించుకుంటారని భగవత్ పేర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మాంసాహారం తినే వారు భారత్‌లో ఉన్నారని, అయితే దేశంలో మాంసాహారం తీసుకునే వారు కూడా సంయమనం పాటిస్తున్నారన్నారు.  అందుకు కొన్ని నియమాలు పాటిస్తున్నారని తెలిపారు. దేశం మొత్తం పండుగ ఉత్సాహంలో మునిగి దేవీ శరన్నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవరాత్రి సమయంలో ఉపవాసం, నాన్-వెజ్ ఆహారానికి పూర్తిగా దూరంగా ఉంటారని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement