బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మండిపడ్డారు మంత్రి కేటీ ఆర్. నాలుగు రోజుల క్రితం సంజయ్ ను కరీంనగర్ పోలీసులు అక్కడి పార్టీ ఆఫీసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అరెస్టు సందర్భంగా.. పోలీసులకు, బండి కి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే తన గుండును అక్కడ డోర్ కు గుద్దుకున్నారు సంజయ్. కాగా, బండి సంజయ్ చాలా అదుపు చేశారు పోలీసులు. అయితే ఈ ఘటనపై తాజాగా మంత్రి కేటీఆర్ సెటైర్లు పేల్చారు.
‘‘బండి అరెస్ట్ సమయంలో గుండు తీసి గోడకు కొట్టుకున్నాడని.. మరి బండి పోతే బండి వస్తుంది కానీ గుండు పోతే గుండు వస్తుందా ’’? అని బండి సంజయ్ ని ఎద్దేవా చేశారు కేటీఆర్. బీజేపీ పాలనను చీల్చి చెండడతామని.. ఏమి చేస్తారో చేసుకోండని సవాల్ విసిరారు.