ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కనుక గెలవకుంటే కేరళ, పశ్చిమబెంగాల్, కశ్మీర్ రాష్ట్రాల మాదిరిగానే అభివృద్దిలో వెనకబడుతాయని యోగీ ఆదిత్యనాథ్ సీరియస్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి యూపీలో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్‌కి కొద్ది సేపటికి ముందే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంతోపాటు ట్విట్టర్లోనూ ఈ విషయాలను పోస్టు చేశారు. కాగా, దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ రెస్పాండ్ అవుతూ గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు.
యోగీ ఆదిత్యనాథ్ భయపడాల్సిన పనిలేదు. కేరళ మాదిరిగా ఉత్తరప్రదేశ్ మారుతుందంటే అక్కడి ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే కేరళలో ఉత్తమ విద్య, ఆరోగ్య సేవలు, సామాజిక సంక్షేమం, జీవన ప్రమాణాలు ఎంతో బాగున్నాయి. అంతేకాకుండా మతం, కులం పేరుతో ప్రజలను హత్యచేయని సామరస్య సమాజం ఉంది. అట్లాంటి మంచి ప్రభుత్వాన్ని యూపీ ప్రజలు కోరుకుంటారు తప్పా.. మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే ప్రభుత్వాన్ని కోరుకుంటారని అనుకోవడం లేదు.. అని సీఎం పినరయి విజయన్ తన ట్విట్టర్ హ్యాండిల్లో హిందీలో పోస్టు చేశారు.
అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా ట్వీట్‌లో స్పందించారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే యూపీ కాశ్మీర్, బెంగాల్ లేదా కేరళగా మారుతుందని ఓటర్లకు యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. యూపీకి ఎంత అదృష్టం ఉండాలి!! కాశ్మీర్ అందం, బెంగాల్ సంస్కృతి, కేరళ విద్య ఆ ప్రదేశాన్ని ఎంతో అద్భతంగా తీర్చిదిద్దుతాయి” అని థరూర్ పోస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు యోగీ ఒక వీడియో రిలీజ్ చేశారు. గత ఏడాది తృణమూల్ కాంగ్రెస్, మూడవసారి గెలిచిన వామపక్ష పాలిత కేరళ, బెంగాల్‌లను ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. ఈ ఐదేళ్లలో చాలా అద్భుతాలు జరిగాయి. బీజేపీని ఓడించడం అంటే జరిగితే ఈ ఐదేళ్ల శ్రమ చెడిపోతుందన్నారు. బీజేపీ అధికారంలో రాకుంటే ఉత్తర ప్రదేశ్ కాశ్మీర్, కేరళ , బెంగాల్ మాదిరిగా మారుతుంది అని యోగి ఆ వీడియోలో పేర్కొన్నారు.