బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారం కోరుతూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. రెండు రోజుల క్రితం క్యాంపస్ విద్యార్థులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు జరిపారు. అయినా విద్యార్థులు వారి సమస్యలు పరిష్కరించే దాకా ఆందోళన విరమించేది లేదని భీష్మించుకున్నారు. దీంతో ఇవ్వాల రాత్రి భారీ వర్షంలో మంత్రి సబితారెడ్డి వారితో చర్చలు జరిపేందుకు వెళ్లాల్సి వచ్చింది.
అయినా స్టూడెంట్స్ ఏమాత్రం తగ్గడం లేదు. తమ 12 డిమాండ్స్‌ని కచ్చితంగా పరిష్కరించాలని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి లిఖిత పూర్వకంగా రాసి ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని తెగేసి మరి చెబుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా, వీసీ రాహుల్ బొజ్జ వచ్చి డిమాండ్స్ ఒప్పుకున్నా తాము అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వచ్చి లిఖితపూర్వకంగా ఇస్తే గాని ఆందోళన విరమించబోమని చెప్తున్నారు. ప్రస్తుతం బాసరలో భారీ వర్షం కురుస్తోంది. అయితే.. తల్లిదండ్రులను, మీడియాను లోపలికి అనుమతించడం లేదు.