Friday, November 22, 2024

TSRTC: పండ్లు ఫ్రీ గా ఇస్తేనే బస్సు ఎక్కాలే.. డ్రైవర్​ వాదనతో నిరసనకు దిగిన రైతు..

నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె గ్రామం.. నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం.. ఈ గ్రామానికి కేవలం ఒకే ఒక బస్సు వెళుతుంది.. అయితే గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను ప్రతినిత్యం కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకువెళ్లి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజువారీగా బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టుకోగా, తనకు ఉచితంగా రైతు పండ్లు ఇవ్వలేదని ఆగ్రహంతో ఆ
బస్సు డ్రైవర్ కోపంతో ఆ రైతు పండించిన బొప్పాయి పండ్లను బస్సులోకి ఎక్కించుకోలేదు. నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. దీంతో ఆవేదనకు లోనైన రైతు గోపయ్య ఆ బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్లతోపాటు ఇలా బైఠాయించి గంట పాటు నిరసన వ్యక్తం చేశాడు.

ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మెరుగైన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ అంటే ఇప్పుడు అందరూ గౌరవిస్తున్నారు. కానీ, ఇట్లాంటి కొంతమంది సిబ్బంది చేస్తున్న చిల్లర పనులతో ఆర్టీసీపై ఉన్న అభిమానం కాస్త పోయేలా ఉంది. ’’సజ్జనార్​ సర్​.. జర చూడుర్రి.. ఇట్లైతే మీ ఆశయానికి గండి పడ్డట్టే అయితది‘‘.. అని చాలామంది ఫైర్​ అవుతున్నరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement