వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పారు మంత్రి అనిల్. ఏపీ శాసన మండలిలో టీడీపీ నేతలపై మంత్రి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీడీపీ కూడా ఒంటరిగా పోటీచేస్తుందని ప్రకటించగలదా అని ఆయన సవాలు విసిరారు. టీడీపీకి అంత దమ్ము ఉందా అన్నారు. టీడీపీలో కనీసం ఒక్క నాయకుడయినా పొత్తు లేకుండా పోతామని చెప్పగలరా అని ఆయన నిలదీశారు.ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతోన్న టీడీపీ తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాగా, శాసన మండలిలోనూ టీడీపీ నేతల నిరసన కొనసాగింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..