తన ప్రాణాలకు ముప్పు ఉందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. తనను చంపే కుట్రలో పాల్గొన్న వారందరి పేర్లను వీడియో రికార్డ్ చేసినట్లు చెప్పారు. సియాల్కోట్లో జరిగిన పార్టీ భారీ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర గురించి నాకు తెలుసు అని అన్నారు. తాను ఒక వీడియోను రికార్డ్ చేసి సురక్షితమైన స్థలంలో ఉంచానని తెలిపారు. తనకు ఏదైనా జరిగితే ఆ వీడియో దేశం ముందు బహిర్గతం అవుతుందన్నారు. అందులో తనపై ఎవరు కుట్ర పన్నారో, ఎవరెవరు సహకరించారో, అందరి పేర్లు పెట్టానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement