ఈ మధ్యకాలంలో గజం స్థలం కొన్నాలంటేనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అలాంటి ఏకంగా ఓ ఊరుని అమ్మకానికి పెట్టాడు ఓ వ్యక్తి. అది కూడా అతి తక్కువ ధరకే ఆ వూరిని మీ సొంతం చేసుకోవచ్చు.
రూ. 2 కోట్లు ఉంటే చాలు ఒక గ్రామం మొత్తాన్ని కొనేయొచ్చు. ఇంతతకు ఈ ఊరు ఎక్కడ ఉందో తెలుసా స్పెయిన్ లో. జమోరా రాష్ట్రంలోని ఈ ఊరి పూరు సాల్టో డి కాస్ట్రో . పోర్చుగల్ సరిహద్దులో ఉండే ఈ గ్రామాన్ని 260 యూరోలకు (భారతీయ కరెన్సీలో రూ.2కోట్లు) అమ్మకానికి పెట్టాడు ఒక వ్యక్తి. కొండ ప్రాంతంలో ఉన్న ఈ ఊరిలో 44 ఇండ్లు, ఒక స్కూల్, హోటల్, మున్సిపల్ స్కూల్‌తో పాటు ఒక చర్చి ఉన్నాయి. మున్సిపాలిటీ స్విమ్మింగ్ పూల్, ఆటస్థలం, ఒక పాత సివిల్ గార్డ్ బ్యారక్ మాత్రమే ఉన్నాయి. అయితే, గత 30 ఏళ్లుగా ఎవరూ ఈ ఊరిలో నివసించడం లేదు. కొండప్రాంతంలో ఉన్న సాల్టో డి కాస్ట్రోను పర్యాటక కేంద్రంగా మార్చాలనే ఆలోచనతో రోనీ రోడ్రిజ్ అనే వ్యక్తి 2000 సంవత్సరంలో కొనుగోలు చేశాడు. అయితే, యూరప్‌లో ఆర్థికసంక్షోభం తలెత్తడంతో అతని కల నెరవేరలేదు. దాంతో, తనే ఇప్పుడు ఈ ఊరిని ఐడియలిస్టా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టాడు. ‘నాకు పట్టణాల్లో ఉండడమంటే ఇష్టం. అంతేకాదు ఈ ఊరిని నిర్వహించడం నాకు కష్టంగా ఉంది. అందుకనే ఊరు మొత్తాన్ని 260 యూరోలకు అమ్మకానికి పెట్టాను’ అని రోనీ చెప్పాడు. మరి ఈ ఊరిని ఎవరు కొంటారనేది ఆసక్తికరంగా మారింది.
రూ.2కోట్లు ఉంటే చాలు.. ఆ గ్రామం మీ సొంతం
Advertisement
తాజా వార్తలు
Advertisement